ఎస్పీ బాలు గురించి రాష్ట్రపతి, ప్రధానిలకు లేఖ రాసిన జయప్రద

29-09-2020 Tue 19:32
Jayaprada writes letter to Modi and Ram Nath Kovind
  • బాలుకు భారతరత్న ఇవ్వాలని పెరుగుతున్న డిమాండ్లు
  • ఇప్పటికే మోదీకి లేఖ రాసిన జగన్
  • భారతరత్న ఇవ్వడమే ఘన నివాళి అన్న జయప్రద

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే ఈ మేరకు విన్నవిస్తూ ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. విలక్షణ నటుడు కమలహాసన్ కూడా బాలుకి భారతరత్న ఇవ్వాలని ఆకాంక్షించారు.

తాజాగా సీనియర్ నటి జయప్రద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీలకు లేఖ రాశారు. బాలుకు భారతరత్న ఇవ్వాలని లేఖలో కోరారు. దాదాపు 45 వేల పాటలు పాడిన బాలును భారతరత్నతో గౌరవించడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు.