ముమైత్ ఖాన్ నన్ను మోసం చేసింది: హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్

29-09-2020 Tue 18:18
Mumaith Khan deceives cab driver
  • గోవాకు మూడు రోజులకు క్యాబ్ బుక్ చేసుకుంది
  • అక్కడకు వెళ్లాక ఎనిమిది రోజులకు పొడిగించింది
  • డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయింది

సినీ నటి, డ్యాన్సర్ ముమైత్ ఖాన్ పై హైదరాబాదుకు చెందిన రాజు అనే క్యాబ్ డ్రైవర్ తీవ్ర ఆరోపణలు చేశాడు. తనను ముమైత్ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే, రాజు క్యాబ్ లో ముమైత్ గోవా వరకు వెళ్లిందట. మూడు రోజులకని క్యాబ్ బుక్ చేసుకుని... అక్కడికి వెళ్లాక తన టూర్ ను ఎనిమిది రోజులకు పొడిగించిందట.

కిరాయి వస్తుందనే ఆశతో తనకు తాను సర్ది చెప్పుకున్నానని... కానీ, ఎనిమిది రోజులు అయిన తర్వాత తనకు డబ్బులు ఇవ్వకుండా ఆమె వెళ్లిపోయిందని రాజు తెలిపాడు. టోల్ గేట్, అకామడేషన్ డబ్బులు కూడా ఇవ్వలేదని... ఆమె నుంచి తనకు రూ. 15 వేలు రావాలని చెప్పాడు. మరో డ్రైవర్ తన మాదిరి సెలబ్రిటీల చేతిలో మోసపోకూడదనే ఈ విషయాన్ని మీడియా వరకు తీసుకొచ్చానని... పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. టోల్ గేట్ పేమెంట్ రసీదులు, తన మొబైల్ కి ముమైత్ పంపించిన గోవా అడ్రస్ తనకు ఆధారాలని చెప్పాడు.