ముంబయిలో టీవీ నటుడి ఆత్మహత్య... చంపేశారంటున్న తల్లిదండ్రులు

29-09-2020 Tue 17:59
TV actor Akshat Utkarsh found dead in his flat in Mumbai
  • అక్షత్ ఉత్కర్ష్ బలవన్మరణం
  • తన ఫ్లాట్ లో విగతజీవుడిలా ఉత్కర్ష్
  • పోలీసులకు సమాచారం అందించిన గాళ్ ఫ్రెండ్
  • మానసిక ఒత్తిడికి గురై ఉంటాడన్న పోలీసులు

ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బీహార్ కు చెందిన అక్షత్ ఉత్కర్ష్ (26) అనే టీవీ నటుడు ముంబయిలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

ముంబయిలోని అంబోలీ ప్రాంతంలో ఉత్కర్ష్ ఓ గాళ్ ఫ్రెండ్ తో కలిసి ఫ్లాట్ లో ఉంటున్నాడు. అయితే, ఆమె ఆదివారం రాత్రి వాష్ రూమ్ కు వెళ్లిన సమయంలో ఉత్కర్ష్ విగతజీవుడిలా ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లాక్ డౌన్ నేపథ్యంలో టీవీ షూటింగ్ లు నిలిచిపోవడంతో ఉత్కర్ష్ మానసికంగా కుంగిపోయాడని, ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

అయితే ఉత్కర్ష్ తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడ్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. కాగా, పోస్టుమార్టం అనంతరం ఆ టీవీ నటుడి మృతదేహాన్ని అతని తల్లిదండ్రులకు అప్పగించారు.