హ్యాపీ బర్త్‌డే క్యూటీ: అల్లు అర్జున్

29-09-2020 Tue 17:51
Allu Arjun celebrates his wifes birthday
  • భార్య పుట్టినరోజును జరుపుకున్న బన్నీ
  • తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తికి శుభాకాంక్షలు అని ట్వీట్
  • ఎన్నో బర్త్ డేలను జరుపుకోవాలని ఆకాంక్షించిన వైనం

టాలీవుడ్ లోని అందమైన జంటల్లో అల్లు అర్జున్, స్నేహల జోడీ ఒకటి. 2011లో ప్రేమ వివాహం చేసుకున్న వీరు... ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. తన భార్య పుట్టినరోజు సందర్భంగా బన్నీ శుభాకాంక్షలు తెలిపాడు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఎన్నో బర్త్ డేలను మనం ఇలాగే కలిసి జరుపుకోవాలని ఆకాంక్షించాడు. హ్యాపీ బర్త్ డే క్యూటీ అని విష్ చేశాడు. బర్త్ డే కేక్ కట్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు.