రాజకీయ నాయకుడి కుమార్తెతో యాంకర్ ప్రదీప్ పెళ్లి?

29-09-2020 Tue 16:42
Actor Pradeep marrying politicians daughter
  • బుల్లితెరపై దూసుకుపోతున్న ప్రదీప్
  • త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం
  • రాయలసీమ పొలిటీషియన్ కుమార్తెతో పెళ్లంటూ వార్తలు

తెలుగు బుల్లి తెర యాంకర్ గా ప్రదీప్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. పలు పాప్యులర్ షోల ద్వారా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పలు చిత్రాలలో కూడా నటించి, మెప్పించాడు. మరోవైపు ప్రదీప్ ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉన్నాడు. దాంతో ఆయన పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే ప్రదీప్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడనేదే ఆ వార్త. పెళ్లికూతురు రాయలసీమకు చెందిన ఒక పొలిటీషియన్ కుమార్తె అని సమాచారం. దీనిపై ప్రదీప్ ఇంకా స్పందించాల్సి ఉంది. మరోవైపు ప్రదీప్ హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే చిత్రం త్వరలో విడుదల కానుంది.