Rakul Preet Singh: రకుల్ ప్రీత్ పిటిషన్.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు!

Rakul Preet Singh files petition in Delhi HC
  • డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న రకుల్
  • మీడియాలో ప్రసారమవుతున్న పలు కథనాలు
  • మీడియాను నియంత్రించాలని రకుల్ పిటిషన్
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో పలువురు సెలబ్రిటీలను ఎన్సీబీ విచారించిన సంగతి తెలిసిందే. విచారణను ఎదుర్కొన్నవారిలో రియా చక్రవర్తి, దీపికా పదుకునే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ లతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. అయితే మీడియా తనపై ఇబ్బందికరంగా కథనాలను ప్రసారం చేస్తోందని ఢిల్లీ హైకోర్టును రకుల్ ఆశ్రయించింది.

మీడియా రాస్తున్న వార్తలతో తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని పిటిషన్ లో తెలిపింది. ఎన్సీబీ తన విచారణను పూర్తి చేసి, నివేదిక అందించేంత వరకు తన పేరును ప్రస్తావించకుండా మీడియాను నియంత్రించాలని కోరింది. అయితే, దీనిపై ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తెలిపింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు... కేంద్ర ప్రభుత్వంతో పాటు మీడియా నియంత్రణ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15కి వాయిదా వేసింది.
Rakul Preet Singh
Bollywood
Drugs
Delhi HC

More Telugu News