Dubbaka: దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల... నవంబరు 3న పోలింగ్

Dubbaka by election schedule released
  • అక్టోబరు 9న నోటిఫికేషన్
  • నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 19 చివరి తేదీ
  • ఇప్పటికే ప్రచారం షురూ చేసిన ప్రధాన పార్టీలు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానం కోసం సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబరు 9న ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబరు 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ మరుసటి రోజు అంటే అక్టోబరు 17న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరి తేదీ అక్టోబరు 19.

ఇక, ఈ ఉప ఎన్నికలో ప్రధాన ఘట్టమైన పోలింగ్ నవంబరు 3న నిర్వహిస్తారు. నవంబరు 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే ప్రచారం షురూ చేశాయి. అయితే షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, ఇవాళ్టి నుంచి దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో కోడ్ అమలు కానుంది.
Dubbaka
By Election
Schedule
Poling
Notification
Telangana

More Telugu News