Raj Kapoor: బాలీవుడ్‌ లెజెండరీ యాక్టర్ల ఇళ్లను స్వాధీనం చేసుకోనున్న పాకిస్థాన్

Pak to takeover Raj Kapoor and Dilip Kumar homes
  • పెషావర్ లో జన్మించిన రాజ్ కపూర్, దిలీప్ కుమార్
  • వారసత్వ సంపదగా గుర్తించిన పాకిస్థాన్
  • స్వాధీనం చేసుకోనున్న పాక్ పురావస్తు శాఖ
బాలీవుడ్ దిగ్గజ నటులు రాజ్ కపూర్, దిలీప్ కుమార్ ఇద్దరూ పాకిస్థాన్ లోని పెషావర్ లో జన్మించిన సంగతి తెలిసిందే. అప్పట్లో భారత్ లో అంతర్భాగంగా పాక్ ఉండేది. వీరిద్దరూ జన్మించిన ఇళ్లు ఇప్పటికీ ఉన్నాయి. పెషావర్ లోని ఖిస్సా ఖ్వానీ బజార్ లో కపూర్ పూర్వీకులు నిర్మించిన కపూర్ హవేలీ ఉంది. అదే ప్రాంతంలో దిలీప్ కుమార్ పూర్వీకులు నిర్మించిన ఇల్లు కూడా ఉంది.

దిగ్గజ నటులు జన్మించిన ఈ రెండు ఇళ్లను పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తూంక్వా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. నవాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2014లో వీరి ఇళ్లను పాక్ ప్రభుత్వం వారసత్వ సంపదగా గుర్తించింది. పాక్ పురావస్తు శాఖ వీటిని స్వాధీనం చేసుకుని, మరమ్మతులు చేయించి, నిర్వహించనుంది.
Raj Kapoor
Dilip Kumar
Bollywood
Pakistan
Homes

More Telugu News