Mehbooba Mufti: మెహబూబా ముఫ్తీని ఇంకెన్నాళ్లు నిర్బంధిస్తారు?: సుప్రీంకోర్టు

  • ప్రజా రక్షణ చట్టం కింద గృహనిర్బంధంలో మెహబూబా ముఫ్తీ
  • తల్లిని కలిసేందుకు అనుమతించాలని ఆమె కుమార్తె పిటిషన్
  • వారం రోజులు గడువు కోరిన సొలిసిటర్ జనరల్
How Long Can Mehbooba Mufti Be Detained asks Supreme Court to JK administration

మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ఇంకెన్నాళ్లు నిర్బంధిస్తారని జమ్ముకశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఏ ఉద్దేశంతో ఆమెను గృహనిర్బంధం చేస్తున్నారని అడిగింది. ఆమెను కలిసేందుకు కుమార్తె ఇల్తిజ, అంకుల్ ను అనుమతించాలని ఆదేశించింది. ఇల్తిజా వేసిన పిటిషన్ ను విచారిస్తూ సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. తన తల్లిని కలిసేందుకు అధికారులు అనుమతించడం లేదని పిటిషన్ లో ఇల్తిజ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పిటిషన్ ను ధర్మాసనం విచారించింది.

ముఫ్తీని ఇంకెంత కాలం నిర్బంధిస్తారంటూ ధర్మాసనం అడిగిన ప్రశ్నకు బదులుగా వారం రోజుల్లో వివరణ ఇస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దీంతో తదుపరి విచారణను సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రజా రక్షణ చట్టం కింద ముఫ్తీతో పాటు పలువురు నేతలను గృహనిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లాను రెండు నెలల క్రితమే విడుదల చేశారు.

More Telugu News