గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన సోనూ సూద్

29-09-2020 Tue 13:34
Sonu Sood planted saplings in the part of Green India Challenge
  • సోనూ సూద్ ను నామినేట్ చేసిన శ్రీనువైట్ల
  • రామోజీ ఫిలింసిటీలో మొక్కలు నాటిన సోనూ
  • మొక్కలు నాటాలంటూ అభిమానులకు పిలుపు

ప్రముఖ నటుడు సోనూ సూద్ ఇటీవల తరచుగా వార్తల్లో ఉంటున్నారు. లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చి ఎంతో గుర్తింపు సంపాదించుకున్న సోనూ సూద్, చేతికి ఎముకన్నది లేకుండా సాయం చేస్తూ దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు అందుకుంటున్నారు. తాజాగా ఆయన రామోజీ ఫిలింసిటీలో అల్లుడు అదుర్స్ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా దర్శకుడు శ్రీను వైట్ల విసిరిన చాలెంజ్ ను సోనూ స్వీకరించారు. రామోజీ ఫిలింసిటీలో ఆయన మూడు మొక్కలు నాటారు. తన అభిమానులు కూడా ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వాములు అవ్వాలని సోనూ సూద్ పిలుపునిచ్చారు. ఈ మహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ను అభినందించారు.