'మందు భామ'ను కిందపడకుండా పట్టుకున్న పెంపుడు కుక్క!

29-09-2020 Tue 13:23
Pet dog helps drunken owner
  • పెంపుడు శునకం విశ్వాస ప్రదర్శన
  • మద్యం మత్తులో ఉగిపోయిన యజమానురాలు
  • ముందు కాళ్లతో బెడ్ పై కూర్చోబెట్టిన శునకం

కుక్కల విశ్వాసాన్ని ఎప్పుడూ శంకించలేం! మనం ఎంత ప్రేమ చూపితే అవి కూడా అంతే ప్రేమ చూపుతాయి. అందుకు ఈ ఘటనే నిదర్శనం. హన్నన్ క్విటస్ అనే మహిళ ఓ కుక్కను ఎంతో ప్రేమగా పెంచుకుంటోంది. ఆ శునకం పేరు జాక్స్. ఒకరోజు హన్నా ఎక్కువగా మద్యం తాగింది. పడుతూ లేస్తూ ఇంటికి వచ్చిన ఆమె ఎలాగోలా బెడ్ సర్దింది. అయితే మద్యం మత్తు ఎక్కువ కావడంతో హన్నన్ నిలబడడమే కష్టమైపోయింది.

ఆమె ఏ క్షణమైనా కిందపడే ప్రమాదం ఉండడంతో పెంపుడు కుక్క జాక్స్ వెంటనే స్పందించింది. ఆమెను తన ముంగాళ్లతో బెడ్ పై కూర్చోబెట్టి, కిందపడే ప్రమాదం నుంచి కాపాడింది. ఈ వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ మనిషి తరహాలో కుక్క స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.