ఇంత క‌న్నా థ్రిల్లింగ్ ఏముంటుంది?: కోహ్లీ సేన గెలుపుపై అనుష్క శ‌ర్మ‌

29-09-2020 Tue 12:38
anushka sharma about bangalore match
  • సూపర్ ఓవర్‌లో గెలిచిన బెంగళూరు
  • హర్షం వ్యక్తం చేసిన కోహ్లీ భార్య
  • గ‌ర్భిణిగా మ్యాచ్‌ ఎంజాయ్ చేశా 

ఐపీఎల్‌లో నిన్న రాత్రి  ముంబై ఇండియ‌న్స్ పై బెంగుళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. విరాట్‌ కోహ్లీ సేన గెలుపొందడంతో ఆయన భార్య అనుష్క శర్మ హర్షం వ్యక్తం చేసింది. ఆమె ప్రస్తుతం గర్భిణి అన్న విషయం తెలిసిందే. ఓ గ‌ర్భిణి మ్యాచ్‌ను ఎంజాయ్ చేసేందుకు ఇంత క‌న్నా థ్రిల్లింగ్ ఏముంటుంద‌ని ఆమె పేర్కొంది. చాలా ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఈ మ్యాచ్‌ను ఉద్దేశిస్తూ అనుష్క శ‌ర్మ ఈ పోస్టు చేసింది.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 201 పరుగుల భారీ స్కోరు సాధించగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ కూడా అంతే స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయిన విషయం తెలిసిందే. దీంతో విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహించగా అందులో బెంగళూరు విజయం సాధించింది. గ‌త రెండు మ్యాచుల్లో కోహ్లీ సేన ఓడడంతో తీవ్ర విమ‌ర్శ‌లు వచ్చాయి. నిన్నటి మ్యాచ్‌లో గెలవడంతో అతనికి ఊరట లభించింది.