మీ సాహసోపేత స్వభావం, నాయకత్వ పటిమ ప్రజలను చైతన్య పరుస్తాయి: సునీల్ దేవధర్ కి పవన్ విషెస్

29-09-2020 Tue 12:02
pawan wishes sunil
  • ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ ‌కి విషెస్ చెప్పిన పవన్ 
  • ప్రజలకు చేరువయ్యేందుకు తెలుగు నేర్చుకోవాలనుకుంటున్నారు
  • మీ నిబద్ధతను మీ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి

ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్‌ దేవధర్ కి జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'మీ సాహసోపేత స్వభావం, నాయకత్వ పటిమ ప్రజలను చైతన్య పరుస్తాయి. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఇక్కడి ప్రజలకు చేరువయ్యేందుకు తెలుగు నేర్చుకోవాలనే మీ అభిరుచి, మీరు తీసుకున్న బాధ్యత పట్ల అంకిత భావం మీ నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. మీ మార్గదర్శకత్వంలో బీజేపీ-జనసేన కూటమి తప్పక విజయ పథంలో పయనిస్తుంది' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.  

'ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో భవానీ మాత మిమ్మల్ని ఆశీర్వదించి, దేశానికి సేవచేయడానికి ఉన్నత పదవులు అందించాలని నేను కోరుకుంటున్నాను' అని పవన్ కల్యాణ్‌ ట్వీట్ చేశారు.