Donald Trump: 15 నిమిషాల్లో కరోనా ఫలితాలు వచ్చే 15 కోట్ల టెస్టింగ్‌ కిట్లను పంపిణీ చేస్తాం: ట్రంప్

  • అబోట్‌ ర్యాపిడ్‌ పాయింట్‌ ఆఫ్ కేర్‌ కిట్ల పంపిణీ
  • ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తాం
  • విద్యా సంస్థలను త్వరగా తిరిగి ప్రారంభించేందుకు చర్యలు
  • కరోనా పరీక్షల్లో మేము ఫస్ట్.. భారత్‌ సెకండ్‌
we will use 150 million test kits trump

అమెరికాలో కరోనా కేసులు భారీగా నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారిని గుర్తించి, దాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం భారీ ప్రణాళిక రూపొందించుకుంది. ఏకంగా 15 కోట్ల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తెలిపారు. 15 నిమిషాల్లో కరోనాను నిర్ధారించే అబోట్‌ ర్యాపిడ్‌ పాయింట్‌ ఆఫ్ కేర్‌ కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

తమ దేశంలో ఆర్థిక వ్యవస్థల పునరుద్ధరణతో పాటు విద్యా సంస్థలను త్వరగా తిరిగి ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగానే కొవిడ్‌-19 ఉన్న వారిని గుర్తించేందుకు 15 కోట్ల ర్యాపిడ్ టెస్ట్‌ కిట్లను పంపిణీ చేస్తామని చెప్పారు. వాటిలో 5 కోట్ల కిట్లను కరోనా‌ సోకే ముప్పు ఎక్కువగా ఉన్న వైద్య సిబ్బంది వంటి వారికి వాడనున్నట్లు చెప్పారు. మిగతా కిట్లను ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడానికి తోడుగా వాడతామని చెప్పారు.

బడుల్లో కరోనా‌ ఉపాధ్యాయులకు నిరంతరం పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అమెరికాలో ఇప్పటికే 10 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. అత్యధిక పరీక్షలు చేసిన దేశాల జాబితాలో అమెరికా తర్వాత భారత్‌ ఉందని చెప్పారు. కాగా, భారత్‌లో ఇప్పటివరకు మొత్తం 7,31,10,041 కరోనా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

More Telugu News