England: ఇంగ్లండ్ లో కొత్త మార్గదర్శకాలు.. ఐసోలేషన్‌కు నిరాకరిస్తే 10 వేల పౌండ్ల జరిమానా

  • ఇంగ్లండ్ లో కరోనా సెకెండ్ వేవ్
  • ‘టెస్ట్ అండ్ ట్రేస్’ కార్యక్రమాన్ని చేపట్టిన ఎన్‌హెచ్ఎస్
  • ఆదాయం కోల్పోయిన వారి కోసం ప్రత్యేక పథకం
England Impose new rules to stop coronavirus

కరోనా వైరస్ ఇంగ్లండ్ లో మరోమారు చెలరేగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దాని కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ‘టెస్ట్ అండ్ ట్రేస్’లో భాగంగా  నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్‌హెచ్ఎస్) నిర్వహించే కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరు ఎవరికి వారే ఐసోలేషన్‌లోకి వెళ్లాలని, అది వారి చట్టపరమైన విధి అని ప్రభుత్వం పేర్కొంది. ఎవరైనా ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వేయి యూరోల నుంచి 10 వేల పౌండ్ల వరకు జరిమానా తప్పదని హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నిబంధన సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దేశంలో కరోనా రెండోదశ వ్యాప్తి కనిపిస్తున్న నేపథ్యంలోనే ఈ సరికొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఐసోలేషన్ కారణంగా ఇంటి వద్ద ఉండి ఆదాయం కోల్పోయిన వారి కోసం ‘టెస్ట్ అండ్ ట్రేస్’లో భాగంగా 500 పౌండ్ల నగదు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

More Telugu News