Ram Vriksha Gaur: కూరగాయలు అమ్ముకుంటున్న 'చిన్నారి పెళ్లికూతురు' అసిస్టెంట్ డైరెక్టర్

  • లాక్ డౌన్ ప్రభావంతో నిలిచిన చిత్రీకరణలు
  • సొంతూరికి వచ్చి అక్కడే ఆగిపోయిన సహాయ దర్శకుడు
  • తండ్రి బాటలో తోపుడు బండిపై అమ్మకాలు
Balika Vadhu assistant director sells vegetables in lock down days

హిందీ టెలివిజన్ రంగంలో బాలికా వధు అనే సీరియల్ ఎంతో పాప్యులర్ అయింది. ఇదే సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లికూతురు పేరిట ప్రసారమైంది. అయితే ఈ సీరియల్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రామ్ వృక్షగౌర్ ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో తన కుటుంబ వృత్తిని స్వీకరించాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా టీవీ ఇండస్ట్రీ స్తంభించిపోవడంతో రామ్ వృక్షగౌర్ ఉపాధి కోల్పోయాడు. ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం కూరగాయలు విక్రయిస్తున్నాడు.

లాక్ డౌన్ కు ముందు రామ్ వృక్షగౌర్ కు ప్రమోషన్ లభించింది. ఓ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసే చాన్స్ వచ్చింది. సినిమా ప్రారంభం అయ్యేందుకు కొంత సమయం ఉండడంతో తన స్వస్థలం అజాంగఢ్ వచ్చాడు. ఇంతలో లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడే ఆగిపోయాడు. నిర్మాత కూడా సినిమాను వాయిదా వేయడంతో చేసేది లేక, తండ్రి వ్యాపారాన్ని తాను కొనసాగిస్తూ, సొంతూర్లో తోపుడి బండిపై కూరగాయలు అమ్మకం షురూ చేశాడు. ఎలాంటి నామోషీ లేకుండా కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్న రామ్ వృక్షగౌర్ నిజంగా అభినందనీయుడు.

More Telugu News