డొనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా స్పందించిన కంగన రనౌత్

28-09-2020 Mon 20:37
Kangana Ranaut supports Trumps challenge
  • డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని బైడెన్ కు ట్రంప్ సవాల్
  • ట్రంప్ సవాల్లో తప్పు లేదన్న కంగన
  • ట్వీట్ సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్య

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన జో బైడెన్ డ్రగ్స్ వాడుతున్నారని, నిర్ధారణ పరీక్షలను ఆయన చేయించుకోవాలని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. బాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ పై ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ కంగనా రనౌత్... ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు.  

జో బైడెన్ కు ట్రంప్ సవాల్ విసరడం సరైన చర్య అని ఆమె అన్నారు. మానసిక అనారోగ్యాన్ని అపహాస్యం చేయడం, తల్లిని అవమానించడం వంటి చర్యల కంటే ఆ విధమైన ఆరోపణలు చేయడమే ఉత్తమమని చెప్పారు. ట్రంప్ ట్వీట్ లో ఉన్న విషయాన్ని కాకుండా... ఆయన ట్వీట్ చేసిన సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.

బైడెన్ ఎప్పుడూ నిద్రపోతున్నట్టు ఉంటారని... మంగళవారం రాత్రి జరగనున్న చర్చకు ముందు లేదా తర్వాత ఎప్పుడైనా ఆయన డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని ట్రంప్ అన్నారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.