ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్

28-09-2020 Mon 16:29
AP BC Welfare minister Chelluboyina Venugopalakrishna tested corona positive
  • కరోనా బారినపడిన మరో ప్రజాప్రతినిధి
  • ఇటీవలే బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి వేణుగోపాలకృష్ణ
  • నిన్న అంతర్వేదిలో రథం పనులకు ప్రారంభోత్సవం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు కరోనా సోకింది. ఆయనకు తాజా వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మంత్రి వేణుగోపాలకృష్ణ ఇటీవలే సీఎం జగన్ తో కలిసి తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. నిన్న తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో మంత్రి ధర్మానతో కలిసి రథం పనులకు ప్రారంభోత్సవం చేశారు.

కరోనా వైరస్ భూతం సామాన్యులు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అందరినీ వెంటాడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కరోనా బారినపడ్డారు. పైడికొండల మాణిక్యాలరావు, బల్లి దుర్గాప్రసాద్ వంటి నేతలు మరణించడం తెలిసిందే. వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి కూడా కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సైతం కరోనా ప్రభావానికి గురై కోలుకున్నారు.