పెద్ద ఎత్తున కొనుగోళ్లు.. దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

28-09-2020 Mon 15:52
Sensex ends 593 points higher
  • 593 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 177 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 8 శాతానికి పైగా పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్

మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఫైనాన్సియల్, ఎనర్జీ, ఆటో, మెటల్ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 593 పాయింట్లు ఎగబాకి 37,982కి చేరుకుంది. నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 11,228 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (8.24%), బజాజ్ ఫైనాన్స్ (6.43%), యాక్సిస్ బ్యాంక్ (5.58%), ఓఎన్జీసీ (4.57%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.51%).

ఇక సెన్సెక్స్ లో హిందుస్థాన్ యూనిలీవర్ (-0.61%), నెస్లే ఇండియా (-0.12%) షేర్లు నష్టపోయాయి.