సుశాంత్‌తో డేటింగ్‌ చేసిన విషయం నిజమే: ఎన్సీబీ విచారణలో సారా అలీ ఖాన్

28-09-2020 Mon 13:40
I was in date with Sushant Singh Rajput says Sara Ali Khan
  • సుశాంత్ తో కలిసి థాయ్ లాండ్ కు వెళ్లా
  • నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది
  • సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడు

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమార్తె, హీరోయిన్ సారా అలీ ఖాన్ ను ఎన్సీబీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఆమె కీలక విషయాలను వెల్లడించింది. సుశాంత్ తో తాను కొంత కాలం డేటింగ్ చేశానని.. ఇది వాస్తవమని చెప్పింది. ఆయనతో కలిసి థాయ్ లాండ్ పర్యటనకు వెళ్లానని తెలిపింది. తనకు సిగరెట్ తాగే అలవాటు ఉందని, అయితే డ్రగ్స్ ఎప్పుడూ తీసుకోలేదని చెప్పింది. సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని తెలిపింది.

మరోవైపు దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, ఫ్యాషన్ డిజైనర్ సిమోనీ, దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ లను కూడా ఎన్సీబీ అధికారులు  విచారించారు. కరణ్ జొహార్ నిర్మాణ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్న క్షితిజ్ రవి ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ప్రసాద్ కు ముంబై కోర్టు రిమాండ్ విధించింది.