హీరో సుశాంత్‌ ప్రియురాలు రియా బయోపిక్‌ కోసం ప్రయత్నాలు!

28-09-2020 Mon 13:30
rhea biopic in bollywood
  • దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోన్న రియా పేరు
  • డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే అరెస్టు
  • సినీ రంగంలోకి రియా ఎంట్రీ నుంచి సినిమా?
  • రియా బయోపిక్ పై పుస్తకం కూడా?

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోన్న విషయం తెలిసిందే. డ్రగ్స్‌ కేసులో ఆమెను ఇప్పటికే అధికారులు అరెస్టు చేశారు. ఆమె పలువురి పేర్లను చెప్పడం, విచారణలో సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడంతో ప్రతిరోజు రియా పేరు వార్తల్లో వినపడుతోంది. దీంతో ఆమె జీవిత చరిత్రపై బాలీవుడ్‌లో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది.

రియా చక్రవర్తి సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం, సుశాంత్ సింగ్‌తో ఆమె ప్రేమలో పడడం, సుశాంత్‌ మృతి అనంతరం ఆమెపై ఆయన తండ్రి ఆరోపణలు చేయడం, డ్రగ్స్‌ కేసులో అరెస్టు కావడం లాంటి వాటిపై స్క్రిప్టు తయారు చేసుకునే పనిలో బాలీవుడ్ వర్గాలు ఉన్నట్లు సమాచారం.  అంతేకాదు, ఓ ప్రచురణ సంస్థ రియా చక్రవర్తి బయోపిక్ పై పుస్తకం తీసుకొచ్చేందుకు ఆమెతో కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.