మంత్రి అవంతి శ్రీనివాస్ కు దళితుల సెగ!

28-09-2020 Mon 13:24
  • విశాఖలో గుర్రం జాషువా జయంతి వేడుకలు
  • ముఖ్య అతిథిగా హాజరైన అవంతి శ్రీనివాస్
  • స్టేజి మీదకు ఆహ్వానించలేదని ఎస్సీ సెల్ మానిటరింగ్ కమిటీ సభ్యుల నిరసన 
Minister Avanthi Srinivas faces heat from Dalit leaders

గుర్రం జాషువా 125వ జయంతి వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతలు, ప్రజలు ఆయనను స్మరించుకున్నారు. మరోవైపు, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు చేదు అనుభవం ఎదురైంది. విశాఖలోని ఉడా చిల్డ్రెన్ ఏరియాలో ప్రభుత్వం జాషువా జయంతి వేడుకలను నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే దళితుల సమస్యల కోసం పోరాడుతున్న వారిని స్టేజి మీదకు ఆహ్వానించలేదని ఎస్సీ సెల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నిరసనకు దిగారు. దళితులకు మీరిచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. దీంతో వారిని మంత్రి సముదాయించారు. నచ్చచెప్పి, స్టేజి మీదకు ఆహ్వానించారు.