విజయ్ దేవరకొండ, సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో సినిమా!

28-09-2020 Mon 13:06
  • క్రేజీ కాంబినేషన్ లో చిత్రాన్ని నిర్మిస్తున్న ఫాల్కన్ క్రియేషన్స్
  • అద్భుతమైన సినిమాను అందిస్తామన్న విజయ్
  • సుక్కుతో పని చేయడానికి వేచి చూడలేనని వ్యాఖ్య
Vijay Devarakonda to team up with Sukumar

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. విభిన్న కథాంశాలతో అగ్రహీరోలతో సూపర్ హిట్ మూవీలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రానుంది. ఈ చిత్రాన్ని ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై కేదార్ సెలగం శెట్టి నిర్మిస్తున్నారు.  

ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ అభిమానులతో పంచుకున్నాడు. 'నాలో ఉన్న నటుడు చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. నాలో ఉన్న ప్రేక్షకుడు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఒక అద్భుతమైన సినిమాను అందిస్తామని గ్యారంటీ ఇస్తున్నాము. సుక్కు సార్ తో పని చేసేందుకు ఇక వేచి చూడలేను. కేదార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీవు ఒక మంచి స్నేహితుడివి' అని ట్వీట్ చేశాడు.