వెబ్ సినిమాలో నటించిన శ్రుతిహాసన్!

28-09-2020 Mon 12:43
  • ఊపందుకున్న డిజిటల్ ప్లాట్ ఫామ్ 
  • వెబ్ సీరీస్ లలో బిజీ కథానాయికలు 
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వెబ్ సినిమా
  • షూటింగ్ పూర్తయిందన్న శ్రుతిహాసన్  
Shruti Hassan in web film

లాక్ డౌన్ కారణంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఊపందుకుంది. థియేటర్లు మూతబడడంతో చాలామంది దర్శక నిర్మాతలతో పాటు తారలు కూడా అటువైపు దృష్టి పెట్టారు. భవిష్యత్తు అంతా ఓటీటీ ప్లాట్ ఫామ్ లతోనే ముడిపడివుందన్న విషయం తేటతెల్లం కావడంతో పలువురు హీరోయిన్లు వెబ్ సీరీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా వంటి బిజీ తారలు కూడా వాటికి ఓకే చెబుతూ, వెబ్ సీరీస్ లలో నటిస్తున్నారు.

ఈ క్రమంలో అందాలతార శ్రుతిహాసన్ కూడా ఓపక్క ప్రస్తుతం 'వకీల్ సాబ్' చిత్రంలో నటిస్తూనే.. అటువైపు కూడా ఓ అడుగేసింది. తాజాగా ఆమె ఓ వెబ్ సినిమాలో నటించినట్టు సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా శ్రుతిహాసనే తెలిపింది. అయితే, ఇది ఏ ఓటీటీ ప్లేయర్ కోసం నిర్మించారన్నది ఇంకా వెల్లడి కాలేదు.