Bandla Ganesh: నా బాస్ ఓకే చెప్పారు.. నా కలలు మరోసారి నిజమయ్యాయి!: బండ్ల గణేశ్

Bandla Ganesh  says Thank you my god
  • ఓ అద్భుతమైన వార్తను చెబుతాను అంటూ ఉదయం ట్వీట్ 
  • 11.23 గంటలకు మరో ట్వీట్  
  • పవన్ తో సినిమా నిర్మాణం అంటూ వార్తలు 
'నా భవిష్యత్తు గురించి ఈ రోజు ఉదయం 11.23 గంటలకు ఓ అద్భుతమైన వార్తను చెబుతాను' అంటూ ఈ రోజు ఉదయం సినీ నిర్మాత బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. సరిగ్గా 11.23 గంటలకు ఆయన మరో ట్వీట్ చేసి తనకు సంబంధించిన  ఆ గుడ్‌న్యూస్‌ను చెప్పేశారు. 'నా బాస్ ఓకే చెప్పారు. నా కలలు మరోసారి నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు' అని బండ్ల గణేశ్ చెప్పారు.

గతంలో పవన్ కల్యాణ్‌తో కలిసి బండ్ల గణేశ్ పలు సినిమాలు తీసిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం బండ్ల గణేశ్ సినిమాలు తీయడాన్ని వాయిదా వేశారు. పవన్‌తో ‌ కలిసి సినిమా తీసే మరో లక్కీ ఛాన్స్‌ను ఆయన కొట్టేసినట్లు తెలుస్తోంది. ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఏ సినిమా వస్తుందన్న విషయం గురించి తెలియాల్సి ఉంది. మరోసారి పవన్‌తో సినిమా తీయాలని చాలా కాలంగా బండ్ల గణేశ్ ఎదురు చూస్తోన్న విషయం తెలిసిందే.
Bandla Ganesh
Pawan Kalyan
Tollywood

More Telugu News