Nara Lokesh: జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి... మీకెందుకింత అహం అంటూ లోకేశ్ ఆగ్రహం!

Lokesh gets anger after goons attacks on Judge Ramakrishna brother
  • చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఘటన
  • సరుకులు కొంటున్న రామచంద్రపై దుండగుల దాడి
  • దాడిని తీవ్రంగా ఖండించిన లోకేశ్
చిత్తూరు జిల్లాలో కొంతకాలం కిందట జడ్జి రామకృష్ణ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై కొందరు దుండగులు దాడి చేశారు. చిత్తూరు జిల్లా కొత్తకోటలో రామచంద్ర సరుకులు కొంటుండగా దుండగులు హత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకెందుకింత అహం అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు.

"ఎంతమంది దళిత బిడ్డలను బలితీసుకుంటారు జగన్ గారూ? దళితులపై మీ దమనకాండ ఆపరా? వైసీపీ చెత్తపాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా?" అంటూ ప్రశ్నించారు. జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. జడ్జి రామకృష్ణ కుటుంబాన్ని వెంటాడి వేధిస్తున్న వైసీపీ నేతలను, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Nara Lokesh
Judge Ramakrishna
Ramachandra
Attack
Jagan
YSRCP
Chittoor District

More Telugu News