ఐపీఎల్ 2020: పంజాబ్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్

27-09-2020 Sun 19:25
నేడు రాజస్థాన్, పంజాబ్ అమీతుమీ
షార్జాలో మ్యాచ్
మొదట బౌలింగ్ ఎంచుకున్న రాయల్స్
Rajasthan Royals won the toss against Kings XI Punjab

ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆడిన తొలి మ్యాచ్ లో ఘనవిజయం సాధించిన రాయల్స్ ఈ మ్యాచ్ లోనూ నెగ్గి పరంపర కొనసాగించాలని భావిస్తోంది.

అయితే కేఎల్ రాహుల్ నాయకత్వంలోని పంజాబ్ జట్టును తక్కువగా అంచనా వేస్తే బొక్కబోర్లాపడడం ఖాయం. బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో రాహుల్ శివమెత్తిన రీతిలో బ్యాటింగ్ చేసి సెంచరీ చేయడం తెలిసిందే. ఆ పోరులో రాహుల్ సిక్సర్ల మోత మోగించాడు. మరోసారి అదే ఫామ్ కొనసాగిస్తే మాత్రం రాజస్థాన్ జట్టుకు కష్టాలు తప్పవు. మరోవైపు జోస్ బట్లర్ రాకతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది.