PV Sindhu: నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద పీవీ సింధు సందడి

Badminton star PV Sindhu visits Nagarjuna Sagar project
  • కుటుంబ సభ్యులతో కలిసి డ్యామ్ ను సందర్శించిన సింధు
  • సింధుకు ప్రాజెక్టు అధికారుల స్వాగతం
  • కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడిపిన సింధు
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జున సాగర్ డ్యామ్ ను సందర్శించారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి డ్యామ్ అందాలను ఆస్వాదించారు. పీవీ సింధుకు డ్యామ్ అధికారులు స్వాగతం పలికారు. సింధుకు అక్కడి ప్రదేశాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా సింధు తన కుటుంబ సభ్యులతో డ్యామ్ వద్ద ఫొటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు.

గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దాంతో సాగర్ డ్యామ్ కూడా నిండుకుండను తలపిస్తోంది. జలకళతో తొణికిసలాడుతున్న నాగార్జున సాగర్ డ్యామ్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.
PV Sindhu
Nagarjuna Sagar Dam
Visit
Badminton
India

More Telugu News