ప్రియుడి పుట్టినరోజు వేడుక జరిపించడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసిన నయనతార

27-09-2020 Sun 13:09
nayanatara spend lakhs of rupees
  • తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి ఇటీవల గోవా టూర్‌
  • ఓ ప్రైవేట్‌ చార్టర్‌లో చెన్నైకి తిరిగివెళ్లిన ప్రేమికులు
  • ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు చేసిన నయన్

తన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి హీరోయిన్‌ నయనతార ఇటీవల గోవాలో ఎంజాయ్‌ చేసిన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీన్ని గురించి మరిన్ని వివరాలు తెలిశాయి. విఘ్నేశ్ పుట్టినరోజును సాధారణంగా నయనతార విదేశాల్లో సెలబ్రేట్ చేస్తుంది. ఈసారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆమె గోవాలో తన ప్రియుడి బర్త్ డే వేడుకను జరిపించారు. గోవా పర్యటన పూర్తి చేసుకున్న అనంతరం ఓ ప్రైవేట్‌ చార్టర్‌లో వారు చెన్నైకి తిరిగివచ్చారు. ఈ పర్యటన‌ కోసం నయనతార‌ ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు చేసిందట.

నయనతారతో పాటు విఘ్నేశ్ కుటుంబ సభ్యులు కూడా వారి వెంట ఇటీవల గోవాకు వెళ్లారు. నయనతారతో పాటు తన తల్లి ఫొటోలను కూడా విఘ్నేశ్ ఈ సందర్భంగా షేర్ చేశాడు.   కొన్నేళ్లుగా నయనతారతో విఘ్నేశ్‌ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరు కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తరుచూ వైరల్ అవుతున్నాయి.