30 ఏళ్లుగా అన్నం తినకుండా 'టీ' తాగుతూ బతుకుతోన్న మహిళ

27-09-2020 Sun 11:14
woman drinking tea only
  • పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దీనాజ్‌పూర్‌లో ఉండే మహిళ
  • రోజుకు దాదాపు 10 కప్పుల టీ
  • ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వైనం

భారతీయులు టీ ని అమితంగా ఇష్టపడతారు. ఉదయం లేవగానే టీ తాగనిదే చాలా మందికి ఏ పనీ చేయాలనిపించదు. ఉదయం, సాయంత్రం సమయాల్లో తప్పకుండా టీ తాగాల్సిందే అన్నట్లు భావిస్తారు. టీ తో పాటు మిగతా సమయంలో అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటారు. అయితే, పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దీనాజ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు నందరాణి మెహంతో  (67) టీ తప్ప మరేమీ తినకుండా 30 ఏళ్లుగా జీవిస్తోంది.

కుటుంబంతో గొడవ పెట్టుకుని 30 ఏళ్ల క్రితమే నందిరాణి కుమారుడు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాతి నుంచి నందరాణి అన్నం తినకుండా రోజుకు దాదాపు 10 కప్పుల టీ మాత్రమే తాగుతోంది. మురీ అనే ఓ పదార్థాన్ని ఎప్పుడో ఓ సారి ఆమె తింటుంది. అలాగే,  పాన్‌ తింటుంది. 30 ఏళ్లుగా టీ తాగుతూ  ఆమె బతుకుతున్నప్పటికీ ఆమెకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదు. ఆమె తాగే టీ లో పాలు ఎక్కువగా పోస్తుంది. దీంతో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఆమెకు అందుతున్నాయని వైద్యులు చెప్పారు. ఆమె ఓ గుడిసెలో ఉంటూ, టిఫిన్‌ దుకాణం నడుపుతూ జీవిస్తోంది.