ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్య వ్యక్తుల్లో పలువురు భారతీయులు!

27-09-2020 Sun 07:15
Many Indians in Worlds Admired People
  • 42 దేశాల్లో సర్వే
  • తొలి స్థానంలో బరాక్ ఒబామా
  • ఇండియాలో అత్యంత ఆరాధ్యుడిగా మోదీ

ప్రపంచంలోని అత్యంత ఆరాధ్య వ్యక్తుల జాబితాను, 'యువ్ గవ్' సంస్థ, 42 దేశాల్లో సర్వే నిర్వహించి విడుదల చేయగా, పలువురు భారతీయ ప్రముఖులకు స్థానం లభించింది. మొత్తం 20 మంది పురుషుల జాబితాను సంస్థ విడుదల చేయగా, తొలి స్థానం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు దక్కింది. ఇదే జాబితాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కు 14వ స్థానం, క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి 16వ స్థానం, స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కు 17వ స్థానం లభించింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ నాలుగో స్థానంలో నిలిచారని సంస్థ ప్రకటించింది. ఒబామా తరువాత మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బిల్ గేట్స్, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ లు మోదీ కన్నా ముందు ఉన్నారని పేర్కొంది. ఇదే జాబితాలో దలైలామా, వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, ఎంఎస్ ధోనీలకూ స్థానం లభించింది.

ఇక భారత్ విషయానికి వస్తే, మోదీ అగ్రస్థానంలో ఉండగా, తరువాత వరుసగా రతన్ టాటా,ఎంఎస్ ధోనీ, ఉండగా, ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.