Pawan Kalyan: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం

Pawan Kalyan starts party active membership initiative
  • పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం
  • మొదట ఐదు నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు
  • ఆపై అన్ని నియోజకవర్గాల్లో నమోదు
జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ క్రమంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. మొదట ఐదు నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్టుగా సభ్యత్వ నమోదు నిర్వహిస్తున్నారు. ఆపై అన్ని నియోజకవర్గాల్లో షురూ చేస్తారు. ఇవాళ ఉదయం పార్టీ ప్రత్యేకంగా నియమించిన పర్యవేక్షకుల సమక్షంలో ఇచ్ఛాపురం, రాజోలు, నెల్లూరు రూరల్, అనంతపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో  సభ్యత్వాల నమోదు ప్రారంభించారు.

జనసేన పార్టీ ప్రారంభించినప్పటి నుంచి పూర్తిస్థాయిలో పార్టీకి అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న కార్యకర్తలకు ఈ క్రియాశీలక సభ్యత్వం అందించారు. కాగా, పైలెట్ ప్రాజెక్టులో భాగంగా తమ నియోజకవర్గాలను ఎంపిక చేయడంతో పైన పేర్కొన్న ఐదు నియోజకవర్గాల నాయకులు ఎంతో ఉత్సాహంతో క్రియాశీలక సభ్యత్వ నమోదు కోసం పనిచేశారు.
Pawan Kalyan
Active Membership
Janasena
Pilot Project
Andhra Pradesh

More Telugu News