చీరకట్టులో, స్పోర్ట్స్ షూ ధరించి అమ్మాయి విన్యాసాలు... ఆకట్టుకుంటున్న వీడియో
- హూలా హూప్ తో డ్యాన్స్ చేసిన ఇష్నా కుట్టీ
- బాలీవుడ్ గీతానికి అద్భుత నృత్యం
- అభినందనల వెల్లువ
చీరకట్టులో స్పోర్ట్స్ షూ ధరించి ఆమె హూలా హూప్ తో ఎంతో అందంగా నర్తించింది. జెండా ఫూల్ అనే బాలీవుడ్ గీతానికి ఆమె డ్యాన్స్ చేసిన వైనం దేశవ్యాప్తంగా ప్రశంసలకు కారణమైంది. ఇటీవలే ఇష్నా ట్విట్టర్ ఖాతా తెరవగా, ఈ వీడియోకు సంబంధించిన అభినందనలు వస్తున్నాయి. అప్పుడే ఆమెకు వేలల్లో ఫాలోవర్లు వచ్చారు. అంతేకాదు, యూట్యూబ్ లో నిన్న వీడియో పోస్టు చేయగా, భారీ సంఖ్యలో వ్యూస్ లభించాయి.