KCR: విజయదశమి రోజున 'ధరణి' పోర్టల్ ప్రారంభం: కేసీఆర్

Dharani portal starts on Vijayadashami says KCR
  • సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ అన్నింటినీ సిద్దం చేయండి
  • అధికారులకు కొత్త రెవెన్యూ చట్టంపై శిక్షణ ఇవ్వండి
  • దసరాలోగా అన్ని పనులు పూర్తి కావాలి
భూరికార్డుల నిర్వహణ కోసం 'ధరణి' పోర్టల్ ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. విజయదశమి రోజున ఈ పోర్టల్ ను ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ పోర్టల్ కు అవసరమైన పనులన్నింటినీ ఈలోగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బ్యాండ్ విడ్త్ ను సిద్ధం చేయాలని చెప్పారు. తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, రిజిస్ట్రార్లకు కొత్త రెవెన్యూ చట్టంపై శిక్షణ ఇవ్వాలని అన్నారు.

కొత్త రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కొత్త రెవెన్యూ చట్టంతో వీఆర్వో వ్యవస్థ రద్దుకాబోతోంది. ల్యాండ్ రికార్డులను ధరణి పోర్టల్ లో ఫీడ్ చేయనున్నారు. ఇకపై ఏక కాలంలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగిపోనున్నాయి. ఈ పోర్టల్ ఆధారంగానే యాజమాన్య హక్కుల పర్యవేక్షణ, బదిలీ జరగనుంది. యాజమాన్య హక్కులను బదిలే చేసే అధికారాన్ని రిజిస్ట్రేషన్ శాఖకు కల్పించారు.
KCR
TRS
Dharani Portal

More Telugu News