Bombay High Court: వ్యభిచారం క్రిమినల్ నేరం కాదు: బాంబే హైకోర్టు

  • వ్యభిచార గృహాన్ని నిర్వహించడం నేరం
  • లైంగికంగా ప్రేరేపించడం నేరం
  • వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ మహిళలకు ఉంటుంది
Prostitution is not a crime says Bombay High Court

వ్యభిచారం క్రిమినల్ నేరం కిందకు రాదని బాంబే హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎవరినైనా లైంగికంగా ప్రేరేపించడం, వ్యభిచార గృహాన్ని నిర్వహించడం వంటివి మాత్రం నేరమని తన తీర్పులో పేర్కొంది. తన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ మహిళకు ఉంటుందని చెప్పింది.

కేసు వివరాల్లోకి వెళ్తే... ముగ్గురు మహిళలను వ్యభిచారం కేసులో ఏడాది క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ప్రభుత్వ హోమ్ లో ఉంచారు. అయితే మూడు నెలలకు మించి మహిళలను హోమ్ లో ఉంచే వీలు లేదు. ఈ నేపథ్యంలో తన తీర్పును వెలువరించిన కోర్టు... ముగ్గురు మహిళలను విడుదల చేయాలని ఆదేశించింది. ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956 కింద వ్యభిచారం క్రిమినల్ కేసు కాదని తెలిపింది.

More Telugu News