Narendra Modi: వర్చువల్ మీటింగ్ ద్వారా శ్రీలంక ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ

  • ఇరు దేశాల సంబంధాల బలోపేతంపై చర్చించిన నేతలు
  • కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు అవకాశం వచ్చిందన్న మోదీ
  • ఇరు దేశాల ప్రజలు మనవైపు చూస్తున్నారని వ్యాఖ్య
Modi and Rajapaksa virtual meeting

శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సతో భారత ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు వర్చువల్ ప్లాట్ ఫామ్ లో జరగడం విశేషం. ఈ సమావేశం ప్రారంభంలో ప్రధాని మాట్లాడుతూ ఇటీవల జరిగిన శ్రీలంక ఎన్నికల్లో రాజపక్ష ప్రభుత్వం మరోసారి ఘన విజయం సాధించడంతో... ఇరు దేశాల మధ్య సహాయసహకారాలు మరింత బలపడతాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు మరో అవకాశం వచ్చిందని అన్నారు. ఇరు దేశాల ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మన వైపు చూస్తున్నారని తెలిపారు.

వర్చువల్ ప్లాట్ ఫామ్ ద్వారా మోదీ ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరోవైపు, గత ఆగస్ట్ 9న శ్రీలంక ప్రధానిగా రాజపక్స మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈసారి ఆయన బాధ్యతలను స్వీకరించిన తర్వాత వేరే దేశాధినేతతో ఆయన చర్చలు జరపడం ఇదే ప్రథమం. ఇరు దేశాల మధ్య అన్ని రంగాల్లో బంధాలను బలోపేతం చేసుకునే దిశగానే ఇరు దేశ ప్రధానులు చర్చలు జరిపినట్టు సమాచారం.

More Telugu News