SP Balasubrahmanyam: తెలుగు బిగ్ బాస్ వేదికపై ఎస్పీ బాలుకు భావోద్వేగ నివాళి

Nagarjuna pays tributes to legendary singer SP Balasubrahmanyam on Bigg Boss dias
  • దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు అస్తమయం
  • సరిగమలు కన్నీళ్లు పెట్టాయన్న నాగార్జున
  • బాలు గానాన్ని గంధర్వులు ఆస్వాదిస్తుంటారరన్న నాగ్ 
తరానికి ఒక్కరు మాత్రమే ఇలాంటి గాయకులు వస్తారనిపించేలా తన గాన మాధుర్యాన్ని నలు దిక్కులా వ్యాపింపజేసిన మహోన్నత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిన్న పరమపదించారు. ఆయన మృతికి తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో వేదికపై ఘననివాళి అర్పించారు. వారాంతం కావడంతో హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ వేదికపైకి వచ్చారు. ఈ ప్రోమోను స్టార్ మా చానల్ తాజాగా విడుదల చేసింది.

ఆ స్వరం ఇక పలకదని, ఆ వరం మనకిక లేదని నాగార్జున భావోద్వేగాలతో చెప్పారు. సరిగమలు కన్నీళ్లు పెట్టాయి, రాగాలన్నీ బాధపడ్డాయి అంటూ బాలు మృతికి విచారం వ్యక్తం చేశారు. ఆయన సంగీతాన్ని గంధర్వులు తప్పక ఆస్వాదిస్తుంటారని కచ్చితంగా చెప్పగలను అంటూ నాగ్ తెలిపారు.

SP Balasubrahmanyam
Nagarjuna
Bigg Boss
Telugu
Tribute

More Telugu News