Nimmala Rama Naidu: ఏపీలో కరోనా వ్యాప్తికి ఇదే కారణం: నిమ్మల రామానాయుడు

YSRCP govt is responsible for Corona spread
  • మద్యాన్ని ప్రభుత్వం నిత్యావసర వస్తువుగా మార్చేసింది
  • మద్యం వల్ల ప్రభుత్వానికంటే జగన్ కే ఎక్కువ ఆదాయం వస్తోంది
  • నాసిరకం మందుతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుగా మార్చేసి, వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విచ్చలవిడిగా వ్యాప్తి చెందడానికి మద్యం అమ్మకాలే కాణమని అన్నారు. మద్యం అమ్మకాలతో రాష్ట్ర ప్రభుత్వం కంటే రెట్టింపు ఆదాయం జగన్ కు వస్తోందని చెప్పారు. నాసిరకం మందు వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని... ఎందరో మహిళల తాళిబొట్లు తెగిపోతున్నాయని అయినా జగన్ కు లెక్క లేదని మండిపడ్డారు.

ప్రతి సంవత్సరం 20 శాతం మద్యం దుకాణాలను తప్పిస్తామని చెప్పిన జగన్ మాట తప్పారని అన్నారు. మద్యపాన నిషేధంపై కపట నాటకాలను కట్టబెట్టి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Nimmala Rama Naidu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News