Virat Kohli: కోహ్లీకి రూ. 12 లక్షల జరిమానా విధించిన ఐపీఎల్!

Virat Kohli fined Rs 12 lakh for maintaining slow over rate
  • కింగ్స్ లెవెన్ పంజాబ్ మ్యాచ్ తో స్లో ఓవర్ రేటుకు జరిమానా
  • రూ. 12 లక్షల జరిమానా విధించినట్టు ఐపీఎల్ ప్రకటన
  • ఈ మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయిన బెంగళూరు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది. కింగ్స్ లెవెన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కు కారణమయ్యాడనే కారణంతో కోహ్లీకి రూ. 12 లక్షల జరిమానా విధించారు. మరోవైపు ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ 97 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలైంది. కోహ్లీ కూడా బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమయ్యాడు. అంతేకాదు కేఎల్ రాహుల్ క్యాచ్ ని రెండు సార్లు డ్రాప్ చేయడం ద్వారా కోహ్లీ విమర్శలను కూడా మూటకట్టుకున్నాడు.

మినిమమ్ ఓవర్ రేటుకు సంబంధించిన ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం జట్టు సారధి అయిన కోహ్లీకి రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ఐపీఎల్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
Virat Kohli
Team India
IPL
FINE

More Telugu News