Rana Kapoor: లండన్‌లోని యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణాకపూర్ రూ. 127 కోట్ల ప్లాట్ జప్తు

 ED attaches Ranas London Apartment
  • రాణాకపూర్‌పై మనీలాండరింగ్ ఆరోపణలు
  • 2017లో లండన్‌లో 93 కోట్లకు ప్లాట్ కొనుగోలు
  • రాణాకపూర్‌కు సెబీ రూ. కోటి జరిమానా
మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యెస్ బ్యాంకు ప్రమోటర్లలో ఒకరైన రాణా కపూర్‌కు లండన్‌లో ఉన్న రూ. 127 కోట్ల విలువైన ప్లాట్‌ను ఈడీ జప్తు చేసింది. 2017లో 99 లక్షల పౌండ్ల (రూ.93 కోట్లు)కు డీఓఐటీ క్రియేషన్స్ జెర్సీ లిమిటెడ్ పేరిట రాణాకపూర్ ఈ ప్లాట్‌ను కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు.

రాణాకపూర్ తన ఆస్తిని విక్రయించేందుకు ప్లాన్ చేస్తున్నారని, అందులో భాగంగా ఓ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ను కూడా నియమించుకున్నట్టు తెలిపారు. మరోవైపు, మోర్గాన్‌ క్రెడిట్‌ నిధుల సేకరణకు సంబంధించిన వివరాలను స్టాక్‌ మార్కెట్లకు వెల్లడించనందుకు గాను రాణాకపూర్‌పై క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కోటి రూపాయల జరిమానా విధించింది.
Rana Kapoor
CEBI
ED
Yes Bank

More Telugu News