Pakistan: ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు భంగపాటు.. అసెంబ్లీ హాలు నుంచి భారత ప్రతినిధి వాకౌట్

Indian diplomat walks out after Imran Khan raises Kashmir issue
  • ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు
  • భారత వ్యతిరేక వ్యాఖ్యలపై ఘటుగా స్పందించిన భారత ప్రతినిధి తిరుమూర్తి
  • దౌత్యపరంగా దిగజారి పోయి మాట్లాడారని మండిపాటు

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉపన్యసిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడంతోపాటు కాశ్మీర్ సమస్యను లేవనెత్తడంతో భారత దౌత్యవేత్త మిటిటో వినిటో వాకౌట్ చేశారు. ఇమ్రాన్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే ఐరాస జనరల్ అసెంబ్లీ హాలు నుంచి వినిటో వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. నిన్న జరిగిన ఈ సమావేశానికి ఇమ్రాన్ వర్చువల్‌గా హాజరయ్యారు.

ఇమ్రాన్ భారత వ్యతిరేక వ్యాఖ్యలపై ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి తిరుమూర్తి ఘాటుగా స్పందించారు. ఇమ్రాన్ దౌత్యపరంగా దిగజారి వ్యాఖ్యలు చేశారని ట్వీట్ చేశారు. పాక్ ప్రధాని చాలా తక్కువ స్థాయి దౌత్యపరమైన ప్రకటన చేశారని మండిపడ్డారు. పాకిస్థాన్ తన సొంత మైనారిటీలను హింసించడం గురించి, సరిహద్దు ఉగ్రవాదం గురించి దుర్మార్గపు అబద్ధాలు, వ్యక్తిగత దాడులకు దిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు తగిన సమాధానం చెబుతామన్నారు.

  • Loading...

More Telugu News