Britain: కరోనా ఎఫెక్ట్.. 45 మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోనున్న బ్రిటన్ రాణి కుటుంబం

Britian qeeen Elizabeth Family loss 45 million dollars amid corona
  • రాజ ప్రాసాదాలను సందర్శించే పర్యాటకులు కరవు
  • 45 మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోనున్న రాణి కుటుంబం
  • ప్యాలెస్ సిబ్బందికి జీతాల చెల్లింపు నిలిపివేత
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలు కాగా, ఆ ప్రభావం బ్రిటన్ రాణి ఎలిజబెత్ కుటుంబపైనా తీవ్రంగా పడింది. బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రాసాదాలను పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శిస్తుంటారు. ఫలితంగా ఫీజుల రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేది. అదంతా ఎలిజబెత్ ఖాతాలోకి చేరేది. అయితే, కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోవడంతో పర్యాటకుల రాక పడిపోయింది. ఫలితంగా రాణి కుటుంబం 35 మిలియన్ పౌండ్ల (45 మిలియన్ డాలర్లు) ఆదాయం కోల్పోనున్నట్టు రాజకుటుంబం మనీ మేనేజర్ మైఖేల్ స్టీవెన్స్ తెలిపారు.

రాణి నివసించే బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు మరమ్మతులు చేయాల్సి ఉండగా నిధులు లేక ఆపేశారు. దీంతో అది శిథిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిధులు లేకున్నప్పటికీ ప్రభుత్వాన్ని రాణి కోరబోరని, ఉన్న నిధులతోనే సర్దుబాటు చేసుకుంటామని స్టీవెన్స్ పేర్కొన్నారు.  మరోవైపు నిధులు లేక సిబ్బందికి జీతాలు చెల్లించడం నిలిపివేశారు. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో బ్రిటన్ ప్రభుత్వం రాజకుటుంబానికి  69.4 మిలియన్‌ పౌండ్లు అందజేసింది.
Britain
palace
England
buckingham palace
queen elizabeth

More Telugu News