SP Balasubrahmanyam: దయచేసి మా పేరు ముందు 'డాక్టర్', 'పద్మభూషణ్', 'గాన గంధర్వ'లు వద్దు: స్వదస్తూరితో ఎస్బీబీ లేఖ

  • దశాబ్దాల పాటు అలరించిన గానం
  • ఎన్నో పురస్కారాలు, బిరుదులు
  • బయటకు చెప్పుకునేందుకు ఇష్టపడని బాలు
Balu Letter with Own Hand Writing

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం ఆబాలగోపాలాన్ని దశాబ్దాల పాటు అలరించింది. ఆయన గానామృతానికి పరవశించని వారుండరు. చిత్ర సీమకు, కళామతల్లికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో సత్కారాలు, పురస్కారాలు అందుకున్న ఘనుడాయన. ఎన్నో వర్శిటీలు డాక్టరేట్లను ఇచ్చాయి. భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ఇచ్చింది. ఇక ఆయన అందుకున్న నందులు, ఇతర సినీ అవార్డులకైతే లెక్కే లేదు.

అయితే, బాలు ఎన్నడూ తన బిరుదులను బయటకు చెప్పుకునేందుకు ఇష్టపడరు. తనను ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి పిలిచినా, తన పేరు ముందు ఎటువంటి విశ్లేషణలూ వేయవద్దని ముందే స్పష్టం చేసేవారు. ఎస్పీబీ స్వయంగా రాసిన ఓ లేఖ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ లేఖలో "సన్మానితులు శ్రీ ప్రకాశ్ గారికి, నమస్సులు. విజయదశమి శుభాకాంక్షలు. నవంబర్ 30న మీ కార్యక్రమంలో తప్పక పాల్గొనగలను. కొన్ని చిన్ని చిన్ని అభ్యర్థనలను మీరు మన్నించక తప్పదు. దయచేసి నా పేరు ముందు డాక్టర్, పద్మభూషణ్, గాన గంధర్వ లాంటి విశ్లేషణలు వేయకండి. మనకు ఇంకా వ్యవధి ఉంది కాబట్టి, ప్రయాణ వివరాలు తరువాత తెలుపగలను. కృతజ్ఞతలతో శ్రీ.పం. బాలసుబ్రహ్మణ్యం" అని రాశారు.

More Telugu News