రాణించిన పృథ్వీ షా, పంత్... చెన్నై టార్గెట్ 176 రన్స్

25-09-2020 Fri 21:18
Prithvi Shah and Rishabh Pant guided Delhi Capitals for a fighting total
  • టాస్ గెలిచిన చెన్నై
  • మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు

చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా 43 బంతుల్లో 64 పరుగులు చేశాడు. షా 9 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అతడికి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (35) నుంచి మంచి సహకారం లభించింది.

ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన రిషబ్ పంత్ తో పాటు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (26) కూడా ధాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది. పంత్ 25 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో పియూష్ చావ్లా 2, శామ్ కరన్ ఒక వికెట్ తీశారు.

కాగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కంట్లో ఏదో పడడంతో షా ఎంతో ఇబ్బందిగా ఫీలయ్యాడు. ఇది గమనించిన ధోనీ... దగ్గరికి వచ్చి కంట్లో ఏదైనా నలుసు పడేందేమో అని పరిశీలించి, ఎలాంటి ఇబ్బంది లేదులే అని అనునయించడం మ్యాచ్ లో దర్శనమిచ్చింది.