చివరి చూపు కోసం పోటెత్తుతున్న అభిమానులు.. ఇంటి నుంచి ఫాంహౌస్ కు ఎస్పీ బాలు పార్థివదేహం తరలింపు

25-09-2020 Fri 20:29
SP Balu Dead Body shifted farm house
  • ప్రజల సందర్శనార్థం ఇంతసేపు స్వగృహం వద్ద బాలు భౌతికకాయం
  • చివరి చూపు కోసం తరలి వచ్చిన వేలాది మంది అభిమానులు
  • రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

అందరినీ శోకసంద్రంలో ముంచుతూ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆసుపత్రి నుంచి బాలు మృతదేహాన్ని చెన్నై కోడంబాక్కంలో ఉన్న ఆయన స్వగృహానికి అభిమానుల సందర్శనార్థం తరలించిన సంగతి తెలిసిందే. ఆయన చివరి చూపు కోసం వేలాది మంది అక్కడకు తరలి వచ్చారు. కన్నీటితో తుది వీడ్కోలు పలికారు.

అయితే, అభిమానుల తాకిడి అంతకంతకూ పెరుగుతుండటంతో... కాసేపటి క్రితం ఇంటి నుంచి ఆయన పార్థివదేహాన్ని తామరైపాక్కంలో ఉన్న ఫాంహౌస్ కు తరలించారు. రేపు ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.