ఐపీఎల్ 2020: చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ప్రారంభం

25-09-2020 Fri 19:44
Chennai Super Kings won the toss against Delhi Capitals
  • టాస్ గెలిచిన చెన్నై
  • బౌలింగ్ ఎంచుకున్న ధోనీ
  • 3 ఓవర్లలో 14 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

ఐపీఎల్ 13వ సీజన్ లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య దుబాయ్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన చెన్నై జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టు ఆసీస్ పేస్ జోష్ హేజెల్ వుడ్ ను తుది జట్టులోకి తీసుకుంది. భారీగా పరుగులు ఇస్తున్న సఫారీ పేసర్ లుంగి ఎంగిడీని తప్పించారు. టాస్ ఓడడంతో మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టు 3 ఓవర్లలో 14 పరుగులు చేసింది. క్రీజులో పృథ్వీ షా (10), శిఖర్ ధావన్ (3) ఉన్నారు.