గత 24 గంటల్లో ఏపీలో 48 కరోనా మరణాలు

25-09-2020 Fri 18:36
AP witnesses least corona deaths in recent days
  • రాష్ట్రంలో 5,606కి పెరిగిన కరోనా మృతుల సంఖ్య
  • తాజాగా 7,073 కొవిడ్ కేసులు
  • మరో 8,695 మందికి కరోనా నయం

ఏపీలో గడచిన 24 గంటల్లో 48 మంది కరోనాతో మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 8 మంది, ప్రకాశం జిల్లాలో 8 మంది, అనంతపురం జిల్లాలో ఆరుగురు కన్నుమూశారు. మరికొన్ని జిల్లాల్లోనూ కరోనా మరణాలు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5,606కి పెరిగింది.

తాజాగా 7,073 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,031 కేసులను గుర్తించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,458కి పెరిగింది. ఏపీలో మరో 8,695 మందికి కరోనా నయం అయింది. దాంతో ఇప్పటివరకు కరోనా నుంచి విముక్తులైన వారి సంఖ్య 5,88,169గా నమోదైంది. ఇంకా, 67,683 మంది చికిత్స పొందుతున్నారు.