ఎస్పీ బాలుకు భావోద్వేగంతో అంజలి ఘటించిన కృష్ణ

25-09-2020 Fri 17:47
Super Star Krishna emotional about SP Balasubrahmanyam demise
  • బాలు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం
  • నాకు అన్ని పాటలు ఆయనే పాడేవారు
  • ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సూపర్ స్టార్ కృష్ణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాలుతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఓ భావోద్వేగ వీడియోను పోస్ట్ చేశారు.

'ఈరోజు బాలు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్ణకరం. 'నేనంటే నేనే' సినిమాకి బాలు చేత అన్ని పాటలు పాడించాలని కోదండపాణిగారు ప్రపోజ్ చేశారు. దానికి మేమంతా ఒప్పుకున్నాం. ఆ సినిమాకి అన్ని పాటలు బాలు పాడారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఘంటసాలగారు బతికున్నప్పుడు కూడా నాకు అన్ని పాటలు బాలు పాడేవారు. బాలు మన మధ్య లేకపోవడం బాధాకరం. అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వారి కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నా' అని కృష్ణ తెలిపారు.