బాలు ఇంటికి చేరుకున్న పార్థివదేహం.. భారీ సంఖ్యలో వస్తున్న అభిమానులు!

25-09-2020 Fri 16:38
SPB dead body reaches to his home
  • ఆసుపత్రి నుంచి కోడంబాక్కంలోని ఇంటికి భౌతికకాయం తరలింపు
  • బాలు ఇంటికి చేరుకున్న వందలాది మంది అభిమానులు
  • రేపు ఫాంహౌస్ లో అంత్యక్రియలు

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహం చెన్నైలోని కోడంబాక్కంలో ఉన్న ఆయన నివాసం వద్దకు చేరుకుంది. ఎంజీఎం ఆసుపత్రి నుంచి అంబులెన్సులో ఆయన భౌతికకాయాన్ని తరలించారు. అప్పటికే ఆయన ఇంటి వద్దకు వందలాది మంది చేరుకున్నారు. కరోనా భయాలను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన గాయకుడిని చివరి సారి చూసుకోవాలని పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుంటున్నారు. మరోవైపు బాలు అంత్యక్రియలు రేపు చెన్నై సమీపంలోని తామరైపాకంలో ఉన్న ఆయన ఫాంహౌస్ లో జరగనున్నాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరగుతున్నాయి.