Jagan: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది: సీఎం జగన్

CM Jagan shocked after heard the demise of SP Balasubrahmanyam
  • గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూత
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సీఎం జగన్ ట్వీట్
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం
మహా గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారన్న వార్తతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఏపీ సీఎం జగన్ తెలిపారు. 6 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కీర్తించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. 'రిప్ ఎస్పీబీ' అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు.

ఎస్పీ బాలు పరిస్థితి అత్యంత విషమం అని చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు నిన్న సాయంత్రం ప్రకటించినప్పటి నుంచే విషాద ప్రకటనలు మొదలయ్యాయి. కమల్ హాసన్ వంటి సన్నిహితులు సహా కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో బాలు ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. ఈ ఉదయం కూడా ఆయన పరిస్థితిపై స్పష్టత రాలేదు. చివరికి మధ్యాహ్నం ఆయన మరణించినట్టు వెల్లడి కావడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.
Jagan
SP Balasubrahmanyam
Demise
Singer
Corona Virus

More Telugu News